దయచేసి పాస్ చేయండి.. ప్రేమను బతికించండి.. జవాబు పత్రంలో పదో తరగతి విద్యార్థి అభ్యర్థన
పదో తరగతి పాస్ అయితేనే తనతో ప్రేమ కొనసాగిస్తానని గాళ్ ఫ్రెండ్ చెప్పిందని జవాబు పత్రంలో రాసిన విద్యార్థి ‘నా ప్రేమ మీ చేతుల్లోనే ఉంది. అమ్మాయి ప్రేమ కొనసాగాలంటే నేను పాస్ కావాలి’ అని రాశాడు. దయచేసి తనను పాస్ చేయాలని కోరుతూ ఆన్సర్ షీట్ మధ్యలో రూ. 500 పెట్టాడు. ఈ డబ్బులతో టీ తాగాలని.. తనను పాస్ చేయాలని అభ్యర్థించాడు. ఇది కాస్తా సోషల్ మీడియాకెక్కడంతో వైరల్ అయింది.