సిక్సర్ తో ఐపీఎల్ అరంగేట్రం.. అయినా కన్నీళ్లతో మైదానం వీడిన వైభవ్.. వీడియో ఇదిగో!

Vaibhav Suryaavanshis Emotional IPL Debut A Sixer and Tears
  • రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ లోకి ఎంట్రీ
  • 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు
  • కీలక సమయంలో ఔటై తీవ్ర భావోద్వేగానికి లోనైన వైభవ్
ఐపీఎల్ లో ఆడుతున్న అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ తొలి బంతినే సిక్సర్ గా మలిచాడు. శనివారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన వైభవ్, తన అరంగేట్రాన్ని చిరస్మరణీయం చేసుకున్నాడు. కేవలం 20 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. అటు యశస్వి జైశ్వాల్, ఇటు వైభవ్ సూర్యవంశీ పోటాపోటీగా సిక్సర్లు బాదుతూ రాజస్థాన్ రాయల్స్ విజయం నల్లేరు మీద నడకేనని అనిపించారు.

పదిహేను ఓవర్లలోనే మ్యాచ్ ను ముగిస్తారని అభిమానులు భావించేలా చేశారు. మరికొద్దిసేపు క్రీజులో ఉండి ఉంటే అలవోకగా అర్ధ శతకం బాదేసేవాడే. దురదృష్టవశాత్తూ స్టంపౌట్ తో వైభవ్ వెనుదిరగాల్సి వచ్చింది. ఐడెన్ మార్క్‌రమ్ బౌలింగ్‌లో వైభవ్ ఔటయ్యాడు. పెవిలియన్ చేరే సమయంలో అతను తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నట్లు కనిపించడం అందరినీ కదిలించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Go Back to Shorts
Vaibhav Suryaavanshi
IPL
Rajasthan Royals
Youngest IPL Player
IPL Debut
Sixer
Emotional
Viral Video
Yashasvi Jaiswal
Cricket

More Telugu News