Sonia Gandhi: సోనియా, రాహుల్ పై ఈడీ చార్జిషీట్... ఖర్గే స్పందన ఇలా

ED Chargesheet Against Sonia Rahul Gandhi Kharges Reaction
షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లను నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్‌షీట్‌లో ఈడీ నమోదు చేసిన విషయం విదితమే. దీనిపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు.

పార్టీ జనరల్ సెక్రటరీలు, ఇంచార్జీల సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే ఈడీ ఛార్జ్‌షీట్‌లో సోనియా, రాహుల్ పేర్లను పేర్కొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో పెద్ద కుట్ర ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఎవరి పేర్లు పెట్టినా తాము భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఛార్జ్‌షీట్‌లో పేర్లు నమోదు చేయడానికి రెండు, మూడు రోజుల ముందే నేషనల్ హెరాల్డ్ ఆస్తులను సీజ్ చేశారన్నారు.

యంగ్ ఇండియన్ అనేది లాభార్జన సంస్థ కాదని ఆయన పేర్కొన్నారు. దీని షేర్లు, ఆస్తులు లేదా లాభాలను ఎవ్వరూ తీసుకోలేదని, బదిలీ కూడా చేసుకోలేదని చెప్పారు. బీజేపీ వాళ్లు అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రజలకు వాస్తవాలను తెలియజెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. 
Go Back to Shorts
Sonia Gandhi
Rahul Gandhi
ED Chargesheet
National Herald Case
Mallikarjun Kharge
Congress Party
BJP
Political Conspiracy
Young Indian
Enforcement Directorate

More Telugu News