Vaibhav Suryavanshi: ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశి

ఐపీఎల్ లో ఇవాళ డబుల్ హెడర్ లో భాగంగా, రెండో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదిక. 

కాగా, ఈ మ్యాచ్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ ఆడుతున్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు పుటల్లో చోటు దక్కించుకున్నాడు. వైభవ్ సూర్యవంశి వయసు 14 సంవత్సరాల 23 రోజులు మాత్రమే. ఈ టీనేజ్ కుర్రాడికి రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్స్ లో స్థానం లభించింది. 

వైభవ్ సూర్యవంశి బీహార్ కు చెందిన యువ క్రికెటర్. గత కొంతకాలంగా జూనియర్ క్రికెట్లో పరుగుల మోత మోగిస్తున్నాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్ లో సూర్యవంశి 58 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఆ తర్వాత ఆసియా కప్ అండర్-19 పోటీల్లోనూ 44 సగటుతో 176 పరుగులు చేశాడు.

ఇక నేటి ఐపీఎల్ మ్యాచ్ లో రెగ్యులర్ కెప్టెన్ సంజు శాంసన్ గైర్హాజరీలో రియాన్ పరాగ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. మరో వైపు లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఆకాశ్ దీప్ బదులు ప్రిన్స్ యాదవ్ తుదిజట్టులోకి వచ్చాడు.
Vaibhav Suryavanshi
IPL Youngest Player
Rajasthan Royals
IPL 2023
Cricket
Teenage Cricketer
Bihar Cricketer
Indian Premier League
Youngest Debut
Impact Player

More Telugu News