రూ. 2 వేల కోట్లను దోచుకునేందుకు సోనియా ప్రయత్నించారు: బండి సంజయ్

  • నేషనల్ హెరాల్డ్ ద్వారా దేశ సంపదను దోచుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమయిందన్న సంజయ్
  • నేషనల్ హెరాల్డ్ కేసు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటిది కాదన్న కేంద్ర మంత్రి
  • యూపీఏ హయాంలోనే సీబీఐ దర్యాప్తు మొదలయిందని వెల్లడి
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. రూ. 2 వేల కోట్ల ప్రభుత్వ సంపదను కాజేసేందుకు సోనియాగాంధీ ప్రయత్నించారని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ ద్వారా దేశ సంపదను దోచుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమయిందని అన్నారు. 

ఈ కేసు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటిది కాదని... 2011లో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే సీబీఐ దర్యాప్తు మొదలయిందని చెప్పారు. ఆ సమయంలోనే సోనియా, రాహుల్ బెయిల్ పొందారని తెలిపారు. ఈ కేసుతో బీజేపీకి సంబంధం లేదని అన్నారు. తప్పు చేసిన వారు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని చెప్పారు.


More Telugu News