టోక్యో నుంచి చాలా నేర్చుకున్నా: జపాన్ రోడ్‌షోలో రేవంత్ రెడ్డి

తెలంగాణ రాజధాని హైదరాబాద్ అభివృద్ధికి జపాన్ రాజధాని టోక్యో నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన టోక్యోలో నిర్వహించిన భారత్-జపాన్ భాగస్వామ్య రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత్, జపాన్ దేశాలు కలిసి ప్రపంచానికి ఒక అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు.

జపాన్ పర్యటనలో రేవంత్ రెడ్డి బృందం పలు దిగ్గజ కంపెనీలతో సమావేశమైంది. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని జపాన్ పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆయా రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. లైఫ్ సైన్సెస్, జీసీసీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలిపారు. ఈవీ, టెక్స్‌టైల్స్, ఏఐ, డేటా సెంటర్లు, లాజిస్టిక్స్‌లో పెట్టుబడులను ఆహ్వానించారు.


More Telugu News