ముంబయి ఇండియన్స్ తో సన్ రైజర్స్ ఢీ... టాస్ కబురు ఇదిగో!
- ఐపీఎల్ లో ఇవాళ ఆసక్తికర మ్యాచ్
- ముంబయి వాంఖెడే స్టేడియంలో పోరు
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్
- సన్ రైజర్స్ కు మొదట బ్యాటింగ్
హైదరాబాద్ మేనేజ్ మెంట్ గత మ్యాచ్ లో ఆడిన జట్టునే ఈ మ్యాచ్ కు బరిలో దించుతోంది. మరోవైపు, ముంబయి జట్టులోనూ ఎలాంటి మార్పులు లేవని కెప్టెన్ హార్దిక్ పాండ్యా సంకేతాలు ఇచ్చాడు.
ఈ టోర్నీలో సన్ రైజర్స్, ముంబయి ఇండియన్స్ జట్ల ప్రస్థానం ఒకేలా సాగుతోంది. సన్ రైజర్స్ 6 మ్యాచ్ లు ఆడి 2 విజయాలు సాధించగా, ముంబయి కూడా 6 మ్యాచ్ ల్లో రెండు విజయాలు నమోదు చేసింది. అయితే, రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో ముంబయి 7వ స్థానంలో ఉండగా, సన్ రైజర్స్ 9వ స్థానంలో ఉంది.