హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతల ధర్నా

  • నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఛార్జిషీట్‌లో చేర్చిన ఈడీ
  • నిరసనగా బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా
  • టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన
హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లను ఈడీ ఛార్జ్‌షీట్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.


More Telugu News