Varshaini: వర్షిణిని పెళ్లాడిన అఘోరి.. వీడియో ఇదిగో!

Aghori Marries Varshaini Viral Wedding Video Sparks Outrage

--


తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారిన అఘోరి వ్యవహారానికి సంబంధించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి వర్షిణిని వెంటతీసుకుని తిరుగుతున్న అఘోరి.. తాజాగా ఆ వర్షిణిని పెళ్లాడింది. మధ్యప్రదేశ్ లోని ఓ మారుమూల ప్రాంతంలోని ఆలయంలో ఈ వివాహం జరిగినట్లు సమాచారం. వర్షిణి మెడలో అఘోరి తాళి కడుతున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వర్షిణి, అఘోరి ఇద్దరూ దండలు మార్చుకోవడం, తలంబ్రాలు పోసుకోవడంతో పాటు ఏడడుగులు నడిచిన దృశ్యాలు ఆ వీడియోలో దర్శనమిచ్చాయి.

ఏపీలోని నందిగామలో అఘోరికి వర్షిణికి పరిచయం ఏర్పడింది. వివస్త్రగా ఉన్న అఘోరికి వర్షిణి సాయం చేయడం, ఆ తర్వాత వర్షిణి కుటుంబ సభ్యుల ఆహ్వానంతో అఘోరి వారి ఇంట్లో కొన్నిరోజులు గడిపింది. అక్కడి నుంచి వెళ్లిపోతూ వర్షిణిని కూడా అఘోరి తన వెంట తీసుకెళ్లింది. గుజరాత్‌లోని సౌరాష్ట్రకు తీసుకెళ్లగా వర్షిణి కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ వెళ్లి ఇంటికి తీసుకువచ్చారు. కొన్నాళ్లు బాగానే ఉన్న వర్షిణీ మళ్లీ పారిపోయి అఘోరిని కలుసుకుంది. తాజాగా అఘోరిని పెళ్లాడింది.

Varshaini
Aghori
Viral Video
Marriage
Madhya Pradesh
Andhra Pradesh
Nandigama
Controversial Marriage
Social Media
India
  • Loading...

More Telugu News