తమ్ముడ్ని చూసి కన్నీటి పర్యంతమైన మంచు లక్ష్మి... వీడియో ఇదిగో!

  • ఇటీవల కాలంలో మంచు కుటుంబంలో గొడవలు
  • మోహన్ బాబు, మంచు విష్ణులపై మంచు మనోజ్ పోరాటం
  • తాజాగా ఓ కార్యక్రమంలో కలుసుకున్న మంచులక్ష్మి, మనోజ్ 
  • ఇద్దరినీ ఓదార్చిన మౌనిక
ఇటీవల ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదాలకు సంబంధించిన వార్తలు నిత్యం మీడియాలో దర్శనమిస్తున్నాయి. మోహన్ బాబు, మంచు విష్ణు ఓవైపు... మంచు మనోజ్ మరోవైపు... గొడవలు, పోలీస్ కేసులు, కోర్టు మెట్లెక్కడం... ఇలా ఏదో ఒక రూపంలో మంచు కుటుంబం విషయాలు వీధికెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 

ఓ కార్యక్రమంలో మంచు లక్ష్మి, మంచు మనోజ్ కలుసుకున్నారు. చిన్న తమ్ముడ్ని చూడగానే లక్ష్మి కదిలిపోయారు. భావోద్వేగంతో కన్నీటిపర్యంతమయ్యారు. ఈ దశలో మంచు మనోజ్ అర్ధాంగి మౌనిక వచ్చి ఆ అక్కాతమ్ముడ్ని  ఓదార్చారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


More Telugu News