వనజీవి రామయ్య సలహాను పాటించాం: నాగబాబు

  • వనజీవి రామయ్య మృతి కలచివేసిందన్న నాగబాబు
  • ఆయన సలహాతో 10 వేలకు పైగా మొక్కలు నాటామని వెల్లడి
  • రామయ్య ఒక రియల్ హీరో అని ప్రశంస
వనజీవి రామయ్య మృతి పట్ల జనసేన ఎమ్మెల్సీ నాగబాబు విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను కలచివేసిందని అన్నారు. గతంలో హైదరాబాద్ లో అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రామయ్యను సన్మానించడం జరిగిందని తెలిపారు. అప్పటికే మొక్కలు నాటే కార్యక్రమంలో తనకు అవగాహన ఉందని... ఆయన సలహాతో జీడిమెట్లలోని ప్రభుత్వ భూమిలో 10 వేలకు పైగా మొక్కలు నాటామని చెప్పారు. 

రామయ్య చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ తాము కొంత ఆర్థిక సాయం కూడా చేశామని నాగబాబు తెలిపారు. రామయ్య ఒక రియల్ హీరో అని... ఆయనకు పద్మశ్రీ దక్కడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. ప్రకృతి పట్ల ఆయనకున్న అంకితభావం, నిబద్ధత చాలా గొప్పదని కొనియాడారు. ఆయన నాటిన మొక్కల ద్వారా ఎంతో మంది సేద తీరుతున్నారని చెప్పారు. ఆయన స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కొనసాగించాలని పిలుపునిచ్చారు. రామయ్య మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నానని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.


More Telugu News