కేటీఆర్ వ్యాఖ్యలతో ఆ భూములు హెచ్‌సీయూవి కాదని తేలిపోయింది: చామల కిరణ్ కుమార్ రెడ్డి

  • ఐసీఐసీఐ బ్యాంకు రుణం ఇచ్చినట్లు కేటీఆర్ చెప్పడంలో వాస్తవం లేదన్న ఎంపీ
  • టీజీఐఐసీ ఫేస్ వాల్యూ చూసి 27 కంపెనీలు బాండ్లు కొనుగోలు చేశాయన్న ఎంపీ
  • వాటి ద్వారా వచ్చిన డబ్బులే ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా టీజీఐఐసీ ఖాతాలో పడ్డాయని వెల్లడి
ఐసీఐసీఐ బ్యాంకు రుణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో కంచ గచ్చిబౌలి భూములు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానివో లేదా అటవీ శాఖకు చెందినవో కావని స్పష్టమైందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ భూములపై ఐసీఐసీఐ బ్యాంకు రుణం ఇచ్చినట్లు కేటీఆర్ చెప్పడంలో వాస్తవం లేదని పేర్కొన్నారు.

టీజీఐఐసీ ఫేస్ వాల్యూ చూసి 27 కంపెనీలు బాండ్లు కొనుగోలు చేశాయని తెలిపారు. ఆ విధంగా వచ్చిన నిధులే ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా టీజీఐఐసీ ఖాతాలో జమ అయ్యాయని వెల్లడించారు. కేటీఆర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. పేద ప్రజలు సన్న బియ్యం అన్నం తింటుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని చామల మండిపడ్డారు.


More Telugu News