లిఫ్ట్‌లో ఇత‌గాడు చేసిన ప‌నికి ఎవరికైనా అస‌హ్యం క‌ల‌గ‌క‌మాన‌దు.. వైర‌ల్ వీడియో!

  
ఓ వ్య‌క్తి లిఫ్ట్‌లో చేసిన గ‌లీజు పని తాలూకు వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతోంది. స‌ద‌రు వ్య‌క్తి లిఫ్ట్ లో మూత్రం పోయ‌డం వీడియోలో ఉంది. లిఫ్ట్‌లో కెమెరాలు ఉన్న సంగ‌తి గుర్తించ‌ని ఆ వ్య‌క్తి... లోప‌లికి వెళ్ల‌గానే ఆ ప‌ని కానిచ్చేశాడు. త‌ర్వాత తాను దిగాల్సిన ఫ్లోర్ రాగానే లిఫ్ట్ దిగి వెళ్లిపోయాడు. 

కానీ, అత‌డు చేసిన ఆ పిచ్చి ప‌ని లిఫ్ట్ కెమెరాల్లో రికార్డు కావ‌డం, ఆ వీడియో కాస్తా బ‌య‌ట‌కు రావ‌డం జ‌రిగింది. దాంతో స‌ద‌రు వ్య‌క్తిపై... వీడియో చూసిన‌వారు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇలాంటి వారికి త‌గిన బుద్ధి చెప్పాల‌ని కొంద‌రు, ఇదేం పాడు బుద్ధి... ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా అని మండిప‌డుతున్నారు.   




More Telugu News