నెల్లూరు జిల్లాలో అమోనియా గ్యాస్ లీక్

  • పదిమంది కార్మికులకు అస్వస్థత
  • భయంతో పరుగులు పెట్టిన మిగతా కార్మికులు
  • టీపీగూడూరు మండలం అనంతపురంలో ఘటన
  • చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించిన గ్యాస్
నెల్లూరు జిల్లాలో అమోనియా గ్యాస్ లీక్ కలకలం సృష్టించింది. టీపీగూడురు మండలం అనంతపురం గ్రామంలోని వాటర్ బేస్ కంపెనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం గ్యాస్ లీక్ కావడంతో కార్మికులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఊపిరాడక పది మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. 

అంబులెన్స్ ల సాయంతో వారిని హుటాహుటిన నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతపురం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకూ గ్యాస్ వ్యాపించిందని స్థానికులు తెలిపారు. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ముందు జాగ్రత్తగా మాస్కులు ధరించారు.


More Telugu News