టీ20 ప్రపంచకప్‌లో చోటు గల్లంతు.. గాలి పటం ఎగరవేస్తూ గడుపుతున్న పాక్ బౌలర్
- భారత్ తో మ్యాచ్ లో ఆపరేషన్ సిందూర్ పై హారిస్ రవూఫ్ వివాదాస్పద సైగలు
- రెండు మ్యాచ్ ల నిషేధం విధించిన ఐసీసీ
- తాజాగా ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కని వైనం
- వైరల్ గా మారిన గాలిపటం ఎగరవేస్తున్న వీడియో
జట్టులో స్థానం కోల్పోయినందుకు రవూఫ్ విచారంగా ఉంటాడని ఆయన అభిమానులు భావించగా.. రవూఫ్ మాత్రం స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగురవేస్తూ ఉల్లాసంగా గడుపుతున్నాడు. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు రవూఫ్ తీరును ఎండగడుతూ విమర్శలతో దాడి చేస్తున్నారు.
జట్టులో చోటు కోల్పోయిన సమయంలో ఇలా వినోదాల్లో మునిగిపోవడాన్ని పాక్ క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘జట్టులో చోటు దక్కలేదనే చింత ఏమాత్రం లేకుండా గాలిపటాలు ఎగురవేస్తున్నాడు’ అంటూ కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తుండగా.. ‘బౌలింగ్ కంటే కూడా గాలిపటం ఎగరవేయడంలోనే నైపుణ్యం ఎక్కువ ఉన్నట్లు ఉంది’ అంటూ మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు.