న‌డిరోడ్డుపై మూడు పాముల స‌య్యాట‌.. ఇదిగో వైర‌ల్‌ వీడియో!

   
న‌డిరోడ్డుపై మూడు పాముల స‌య్యాట‌కు సంబంధించిన వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. వీడియోలో ఒక ఆడ పామును రెండు మ‌గ పాములు అనుస‌రిస్తూ రోడ్డుపైకి రావ‌డం ఉంది. ఆ త‌ర్వాత ఆడ పామును ఓ మ‌గ పాము పెనవేసుకుని స‌య్యాట‌ల్లో మునిగింది. ప‌క్క‌నే ఉన్న మ‌రో పాము నేను కూడా నీ ప్రేమ కోసమే వ‌చ్చాన‌న్న‌ట్లుగా వాటి మ‌ధ్య దూర‌డం వీడియోలో ఉంది. 

అలా ఆ మూడు పాములు ప‌ర‌స్ప‌రం పెనవేసుకుని కొద్దిసేపు రోడ్డుమీద దొర్లాయి. అటువైపుగా వెళ్లిన కొంద‌రు వాటిని వీడియో తీసి సామాజిక మాధ్య‌మాల్లో పెట్ట‌డంతో అది కాస్త‌ వైర‌ల్‌గా మారింది. ఇక వీడియో చూసిన నెటిజ‌న్లు పాముల ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీలా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈ అరుదైన ఘ‌ట‌న‌ పూణే కంటోన్మెంట్ ప‌రిధిలో జ‌రిగిన‌దిగా ఓ యూజ‌ర్ వీడియోను పోస్ట్ చేస్తూ పేర్కొన్నారు.  


More Telugu News