వ‌ర్షాల‌పై తెలంగాణ ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణ శాఖ అలర్ట్!

  
తెలంగాణలోని ప‌లు జిల్లాల్లో ఈరోజు, రేపు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది. ఖమ్మం, సూర్య‌పేట‌, భ‌ద్రాద్రి కొత్తగూడెం, హ‌న్మ‌కొండ‌, వ‌రంగ‌ల్‌, ములుగు, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, మ‌హ‌బూబాబాద్ జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు మెరుపుల‌తో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. 

గంటకు 40 నుంచి 50 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవ‌కాశం ఉండ‌టంతో ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది. ఇక హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉండటంతో ఈ జిల్లాల‌కు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది.  


More Telugu News