గుడ్డలు ఊడదీయడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా?: జగన్ వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు విమర్శలు

  • పోలీసుల యూనిఫాం విప్పించి ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్న జగన్
  • జగన్ వ్యాఖ్యలను ప్రజలు అర్థం చేసుకోవాలన్న శ్రీనివాసరావు
  • జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
పోలీసు అధికారుల గుడ్డలు ఊడదీస్తామని, యూనిఫాం విప్పించి ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. జగన్ వ్యాఖ్యలను ఏపీ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు ఖండించారు. ప్రెస్ మీట్ లో శ్రీనివాసరావు మాట్లాడుతూ... పోలీసుల బట్టలూడదీసి నిలబెడతామని చెప్పడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. 

గుడ్డలు ఊడదీయడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా? అని శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఎంతో ఒత్తిడితో పోలీసులు పనిచేస్తున్నారని... ఇలాంటి పరిస్థితుల్లో ఇలా వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. జగన్ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని కోరారు. జగన్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని... క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు.


More Telugu News