అంధులను కోర్టుల చుట్టూ తిప్పుతున్నారంటూ అధికారులపై హైకోర్టు జడ్జి ఆగ్రహం

  • తెలంగాణ దివ్యాంగుల శాఖ అధికారుల తీరుపై జడ్జి ఆగ్రహం
  • కొందరు అధికారులు నిజమైన అంధులు అన్న జస్టిస్ నగేశ్ భీమపాక
  • కొందరు అధికారుల తీరు వల్ల అంధుల ఉద్యోగ జీవితం మసకబారుతోందని విమర్శ
కొందరు అధికారులు నిజమైన అంధులని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ దివ్యాంగుల శాఖ అధికారుల తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంధులను కోర్టుల చుట్టూ తిప్పడంపై మండిపడ్డారు. కొందరు అధికారుల తీరు వల్ల అంధుల ఉద్యోగ జీవితం మసకబారుతోందని అన్నారు.

తమను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ కొందరు అంధులు హైకోర్టును ఆశ్రయించారు. వేర్వేరు కారణాలతో తొలగించడంపై ఎనిమిదేళ్లుగా వారు న్యాయపోరాటం చేస్తున్నారు. వారంతా కోర్టుల చుట్టూ తిరగడానికి కారణమైన అధికారులపై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.


More Telugu News