Shraddha Kapoor: స్టార్ హీరోయిన్ పై నిర్మాత అనుచిత వ్యాఖ్యలు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధాకపూర్ ను కించపరిచేలా నిర్మాత దినేశ్ విజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇటీవల విజయవంతమైన ‘స్త్రీ 2’లో శ్రద్ధ నటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాకు శ్రద్ధను ఎంపిక చేయడానికి ఆమె నవ్వే కారణమని, ఆమె అచ్చంగా దెయ్యంలా నవ్వుతుందని దినేశ్ విజయ్ అన్నారట. ఈ విషయాన్ని స్త్రీ 2 దర్శకుడు అమర్ కౌశిక్‌ వెల్లడించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమర్ కౌశిక్ మాట్లాడుతూ.. ‘స్త్రీ’ చిత్రంలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తుంటే నిర్మాత దినేశ్ విజయ్ కల్పించుకుని శ్రద్ధా కపూర్‌ పేరును ప్రతిపాదించారని చెప్పారు.

ఆ పాత్ర కోసం ఆమెను ఎంచుకోవడానికి కారణం కూడా చెప్పారన్నారు. ఓసారి శ్రద్ధాకపూర్‌, దినేశ్‌ ఒకే ఫ్లైట్‌లో ప్రయాణించారని చెప్పారన్నారు. ఆ సమయంలో జరిగిన సంభాషణలో శ్రద్ధ అచ్చం దెయ్యంలా నవ్వుతుందని దినేశ్ అన్నారు. అందువల్ల ఈ పాత్రకు శ్రద్ధనే పూర్తి న్యాయం చేయగలదని దినేశ్ తనతో చెప్పారని అమర్ కౌశిక్ వివరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. దినేశ్ విజయ్ వ్యాఖ్యలపై శ్రద్ధా కపూర్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.
Shraddha Kapoor
Dinesh Vijan
Stree 2
Bollywood Actress
Inappropriate Comments
Producer
Viral Controversy
Amar Kaushik
Film Industry
Casting Controversy

More Telugu News