ఎన్టీఆర్ జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన .. షెడ్యూల్ ఇలా

Chandrababu Naidus NTR District Tour Schedule
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలంలో పర్యటించనున్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ముప్పాళ్లలో ఏర్పాటు చేస్తున్న ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రజలతో ముచ్చటించనున్నారు.

ఉదయం 10:15 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11:30 గంటలకు చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్ద అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికిన తర్వాత రోడ్డు మార్గంలో బయలుదేరి ముప్పాళ్ల గ్రామంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు చేరుకుంటారు. అనంతరం 11:46 గంటలకు నిమ్మతోటలో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారు.

అక్కడ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయడంతో పాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2:15 గంటలకు ముప్పాళ్లలోని వేబ్రిడ్జ్ స్థలం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం 3:40 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి హెలిప్యాడ్ వద్దకు చేరుకుని తిరుగు ప్రయాణం అవుతారు. సాయంత్రం 4:05 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. 
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh CM
NTR District
Nandyala
Chandralapadu
Muppa
Public Meeting
Babu Jagjivan Ram Jayanti
Laptop Distribution
Political Visit

More Telugu News