సీఎస్‌కే ప‌గ్గాలు మ‌ళ్లీ ధోనీకే... కార‌ణ‌మిదే!

  
ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) అభిమానుల‌కు గుడ్ న్యూస్. ఎంఎస్‌ ధోనీ మ‌ళ్లీ ఆ జ‌ట్టు కెప్టెన్సీ చేప‌ట్టనున్నాడు. అది కూడా రేపు సొంత‌ మైదానంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌(డీసీ)తో జ‌రిగే మ్యాచ్‌లో ఎంఎస్‌డీ సార‌థిగా వ్య‌వ‌హరించ‌నున్నాడు. 

ప్ర‌స్తుతం కెప్టెన్‌గా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ గాయ‌ప‌డ‌డంతో ధోనీ కెప్టెన్సీ చేప‌డ‌తాడ‌ని తెలుస్తోంది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్ స‌మ‌యంలో ఎడ‌మ మోచేతికి గాయంతో బాధ ప‌డిన రుతురాజ్ ... ఢిల్లీతో మ్యాచ్‌కు అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చని స‌మాచారం.

ఈ నేప‌థ్యంలోనే మాజీ కెప్టెన్‌ అయిన ధోనీకే మ‌ళ్లీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని యాజ‌మాన్యం భావిస్తోంద‌ట‌. శ‌నివారం చెపాక్ స్టేడియంలో చెన్నై జ‌ట్టు ఢిల్లీతో త‌ల‌ప‌డ‌నుంది. ప్ర‌స్తుతం ఆడిన మూడు మ్యాచుల్లో ఒకే ఒక విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో 8వ స్థానంలో ఉన్న చెన్నైకి ధోనీ సార‌థ్యం వ‌హించ‌డం క‌లిసొచ్చే అవ‌కాశం ఉంది.

ఇక సీఎస్‌కేకు ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన ధోనీ.. గ‌తేడాది స్వ‌చ్ఛందంగా సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. త‌న వార‌సుడిగా యువ ఆట‌గాడు రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేశాడు. 


More Telugu News