Mustafa Kamal: భారత వ్యాక్సిన్లు రాకపోవడం మా ఆర్థిక వ్యవస్థకు భారంగా మారింది: పాకిస్థాన్ మంత్రి
- భారత్ నుంచి అందుబాటు ధరలో లభించే వ్యాక్సిన్ల సరఫరా నిలిచిపోయిందని వెల్లడి
- వ్యాక్సిన్ల దిగుమతి కోసం వందల మిలియన్ డాలర్లు ఖర్చవుతున్నాయన్న మంత్రి
- కరోనా సమయంలో భారత్ నుంచి కొవిడ్ వ్యాక్సిన్లు వచ్చినట్లు వెల్లడి
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ నుంచి అందుబాటు ధరల్లో లభించే వ్యాక్సిన్ల సరఫరా నిలిచిపోవడం పాకిస్థాన్‌కు ఆర్థికంగా భారంగా మారిందని ఆ దేశ ఆరోగ్య మంత్రి ముస్తఫా కమల్ వెల్లడించారు. భారత వ్యాక్సిన్లు గత ఏడాది నుంచి రావడం లేదని అన్నారు. వీటి దిగుమతి కోసం వందల మిలియన్ డాలర్లు ఖర్చవుతోందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు పెను భారంగా మారిందన్నారు.
ప్రస్తుతం ప్రతి సంవత్సరం 400 మిలియన్ డాలర్లతో వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుంటున్నామని, వీటిలో 49 శాతం ఖర్చులను 'గావీ' (గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్) ద్వారా పని చేసే అంతర్జాతీయ సంస్థలు, మిగతా 51 శాతం ప్రభుత్వం భరిస్తోందని వెల్లడించారు. స్థానికంగా వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించకపోతే 2031 నాటికి దిగుమతి కోసం రూ.10 వేల కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటికి వ్యాక్సిన్ల సరఫరాకు అంతర్జాతీయ సహకారం ముగిసిపోతుందని అన్నారు.
అత్యంత పేద దేశాల్లోని పిల్లలకు వ్యాక్సిన్ అందించడానికి 'గావీ' పనిచేస్తుంది. 'గావీ' సాయంతో పాకిస్థాన్ అత్యంత చౌకగా టీకాలను సేకరించేది. వీటిలో ఎక్కువగా భారత్ నుంచే వస్తాయని, అవి అందుబాటు ధరల్లో ఉంటాయని పాకిస్థాన్ మంత్రి వెల్లడించారు. కరోనా సమయంలో లక్షలాది కొవిడ్ వ్యాక్సిన్లను భారత్ నుంచి సేకరించడానికి 'గావీ' సహాయం చేసిందని అన్నారు.
పాకిస్థాన్ ప్రభుత్వం ప్రస్తుతం పౌరులకు 13 రకాల వ్యాక్సిన్లను ఉచితంగా అందిస్తోంది. అయితే ఏ వ్యాక్సిన్‌ను కూడా స్థానికంగా ఉత్పత్తి చేయడం లేదు. 24 కోట్ల జనాభాతో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ఐదో దేశంగా పాకిస్థాన్ ఉంది. ప్రతి సంవత్సరం 62 లక్షల జననాలు నమోదవుతుండటంతో వ్యాక్సిన్లకు డిమాండ్ పెరిగింది.