Mumaith Khan: ప్రమాదం కారణంగా ఏడేళ్ల పాటు మంచానికే పరిమితమయ్యా: ముమైత్ ఖాన్

Mumaith Khan Reveals Near Death Accident and 7 Year Recovery
  • తన డ్యాన్స్ తో టాలీవుడ్ ను ఊపు ఊపిన ముమైత్ ఖాన్
  • ఒక ప్రమాదం తన జీవితాన్ని అతలాకుతలం చేసిందని వెల్లడి
  • మెదడులో నరాలకు దెబ్బ తగిలిందన్న ముమైత్
'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' అంటూ కుర్రకారును ఉర్రూతలూగించిన డ్యాన్సర్ ముమైత్ ఖాన్. తన డ్యాన్స్ తో ఒకప్పుడు టాలీవుడ్ ను ఆమె ఊపు ఊపింది. స్పెషల్ సాంగ్స్ చేస్తూ వెండితెరపై ఆమె తనదైన ముద్ర వేశారు. ఆ తర్వాత ఆమె సడన్ గా సినీ పరిశ్రమకు దూరమయ్యారు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఒక ప్రమాదం కారణంగా తాను చావు అంచుల వరకు వెళ్లానని తెలిపారు. ఆ ప్రమాదం కారణంగా తన జీవితం అతలాకుతలం అయిందని చెప్పారు. ప్రమాదం వల్ల మెదడులో నరాలకు దెబ్బ తగిలిందని... ఏడేళ్ల పాటు మంచానికే పరిమితం అయ్యానని తెలిపారు. డ్యాన్స్ కు దూరమయ్యానని చెప్పారు. 

ప్రమాదం నుంచి కోలుకోవడానికి మందులు వాడటంతో లావు అయ్యానని ముమైత్ తెలిపారు. ఆ సమయంలో తన తల్లి తనను కంటికి రెప్పలా చూసుకుందని చెప్పారు. 
Mumaith Khan
Mumaith Khan accident
Telugu actress
Tollywood dance
Special songs
Brain injury
Health recovery
Movie interview

More Telugu News