హెచ్1బీ వీసాదారులకు టెక్ కంపెనీల వార్నింగ్.. భారత్ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్న వలసదారులు
- వలస విధానాల్ని మరింత కఠినతరం చేస్తున్న ట్రంప్
- కఠిన నిర్ణయాలతో వలసదారులపై ఉక్కుపాదం
- హెచ్1బీ వీసాదారులు స్వదేశానికి వెళ్తే.. తిరిగి అమెరికాలో కాలు పెట్టేది అనుమానం
- ఈ నేపథ్యంలో అప్రమత్తమైన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్
- తమ కంపెనీల్లో పనిచేస్తున్న హెచ్1బీ వీసాదారులకు హెచ్చరికలు
దీంతో భారత్ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్టు పలువురు హెచ్1 బీ వీసాదారులు చెప్పినట్టు ‘వాషింగ్టన్ పోస్ట్’ కథనం పేర్కొంది. అమెరికా పౌరులు మినహా, మిగతా అందరూ అక్రమ వలసదారులే అన్న భావన ప్రస్తుతం అక్కడ నెలకొని ఉందని భారతీయ వలసదారులు చెబుతున్నారని వార్తా కథనం తెలిపింది. దీంతో తాము ఎక్కడికి వెళ్లినా అవసరమైన పత్రాలన్నీ తమ వెంట తీసుకెళ్తున్నామని చెప్పారు. ఈ మేరకు ఇప్పటికే భారత ఎంబసీ అధికారులు కూడా ఎన్నారైలను అప్రమత్తం చేశాయి.