Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈడెన్ గార్డెన్స్ లో సన్ రైజర్స్ ముందు భారీ టార్గెట్

Venkatesh Iyer Rahane power KKR to 200 against SRH
Advertisement
  • కోల్ కతాలో ఐపీఎల్ మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసిన కేకేఆర్
  • వెంకటేశ్ అయ్యర్, రఘువంశీ ఫిఫ్టీలు
  • దూకుడుగా ఆడిన అజింక్యా రహానే, రింకూ సింగ్
Advertisement
కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ముందు భారీ లక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసింది. 

వెంకటేశ్ అయ్యర్, ఆంగ్ క్రిష్ రఘువంశీ అర్ధసెంచరీలతో రాణించారు. కెప్టెన్ అజింక్యా రహానే, రింకూ సింగ్ కూడా దూకుడుగా ఆడారు. వెంకటేశ్ అయ్యర్ 29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 60 పరుగులు చేయగా, రఘువంశీ 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో సరిగ్గా 50 పరుగులు చేసి అవుటయ్యాడు. 

అంతకుముందు, టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ఆరంభంలో తడబాటుకు గురైన కేకేఆర్ జట్టు 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (1), సునీల్ నరైన్ (7) సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు. ఈ దశలో కెప్టెన్ అజింక్యా రహానే 27 బంతుల్లో 1 ఫోర్, 4 భారీ సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో దిగువన వచ్చిన రింకూ సింగ్ 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 32 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి ఆండ్రీ రసెల్ (1) రనౌటయ్యాడు. 

సన్ రైజర్స్ బౌలర్లలో షమీ 1, కమిన్స్ 1, జీషన్ అన్సారీ 1, కమిందు మెండిస్ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఫీల్డింగ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పరుగులు భారీగా లీకయ్యాయి.
Advertisement
Advertisement
Venkatesh Iyer
Rinku Singh
KKR vs SRH
IPL 2024
Eden Gardens
Kolkata Knight Riders
Sunrisers Hyderabad
Ajinkya Rahane
Cricket Match
T20 Cricket

More Telugu News