ఆర్‌సీబీకి గుజ‌రాత్ షాక్‌.. బెంగ‌ళూరుకు తొలి ఓట‌మి

  • బెంగ‌ళూరు వేదిక‌గా జీటీ, ఆర్‌సీబీ మ్యాచ్‌
  • బెంగ‌ళూరును 8 వికెట్ల తేడాతో ఓడించిన గుజ‌రాత్
  • రాణించిన సాయి సుద‌ర్శ‌న్ (49), బ‌ట్ల‌ర్ (73)
బెంగ‌ళూరు వేదిక‌గా నిన్న గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ)తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) ప‌రాజ‌యం పాలైంది. బెంగ‌ళూరును గుజ‌రాత్ ఏకంగా 8 వికెట్ల తేడాతో ఓడించింది. 170 ప‌రుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన జీటీ రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి సునాయాస విజ‌యాన్ని సాధించింది.

అంత‌కుముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌కు 169 ర‌న్స్ చేసింది. లివింగ్ స్టోన్ అర్ధ శ‌త‌కం (54), జితేశ్ శ‌ర్మ (33) రాణించారు. ప‌డిక్క‌ల్ (04), కోహ్లీ (07), ర‌జ‌త్ పాటీదార్ (12), ఫీల్ సాల్ట్ (14) నిరాశ‌ప‌రిచారు. చివ‌ర్లో టిమ్ డేవిడ్ (32) మెరుపులు మెరిపించారు. జీటీ బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్ 3, సాయి కిశోర్ 2 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా... ఇషాంత్ శ‌ర్మ‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, అర్ష‌ద్ చెరో వికెట్ తీశారు. 

అనంత‌రం 170 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ మ‌రో 13 బంతులు మిగిలి ఉండ‌గానే, రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఈజీ టార్గెట్‌ను అందుకుంది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ సాయి సుద‌ర్శ‌న్ (36 బంతుల్లో 49 ప‌రుగులు), జాస్ బ‌ట్ల‌ర్ (39 బంతుల్లో 73 ప‌రుగులు) బ్యాట్ ఝుళిపించ‌డంతో 17.5 ఓవ‌ర్ల‌లోనే టార్గెట్‌ను ఛేదించింది. ఆర్‌సీబీ బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, హేజిల్‌వుడ్ త‌లో వికెట్ ప‌డగొట్టారు. త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో కేవ‌లం 19 ర‌న్స్ మాత్ర‌మే ఇచ్చి కీల‌క‌మైన 3 వికెట్లు తీసిన సిరాజ్‌కు 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు ద‌క్కింది. 


More Telugu News