నా పాదాలను ఎవరూ తాకవద్దు, నాయకులకు పాదాలు తాకించుకునే అర్హత లేదు: అజిత్ పవార్

  • ఎన్సీపీ యువజన విభాగం కార్యక్రమంలో అజిత్ పవార్ వ్యాఖ్య
  • పూలదండలు, మెమొంటోలు, శాలువాలు తేవొద్దన్న అజిత్ పవార్
  • తనకు కార్యకర్తల ప్రేమాభిమానాలు, గౌరవ మర్యాదలు చాలన్న పవార్
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పాదాలను ఎవరూ తాకవద్దని, ప్రస్తుత తరం రాజకీయ నాయకులకు పాదాలు తాకించుకునే అర్హత లేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్సీపీ యువజన విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తల్లిదండ్రులు, తన బాబాయ్ ఆశీస్సులతో తాను బాగున్నానని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు పూలదండలు, మెమొంటోలు, శాలువాలు తీసుకురావడాన్ని ఆయన తప్పుబట్టారు.

ఈ తరం నాయకులకు ఆ అర్హత లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. నాయకుల పాదాలను కార్యకర్తలు తాకవద్దని సూచించారు. తనకు కార్యకర్తలు, ప్రజల ప్రేమాభిమానాలు, పరస్పర గౌరవ మర్యాదలు మాత్రమే కావాలని ఆకాంక్షించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.


More Telugu News