రేవంత్ రెడ్డి ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటం దేనికి సంకేతం?: కవిత
- మహిళలపై నేరాలు, దాడులు ఆందోళన కలిగిస్తున్నాయన్న కవిత
- రేవంత్ పాలనలో మహిళలకు రక్షణ లేదని విమర్శ
- కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలన్న కవిత
రాష్ట్రంలో మహిళలపై నేరాలు 22 శాతం పెరిగాయని లెక్కలు చెపుతున్నప్పటికీ ఏమీ పట్టనట్టు రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి దేనికి సంకేతమని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని... మహిళల రక్షణపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.