అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్

01-04-2025 Tue 12:55 | International
Advertisement
  • హిమాలయాలు అద్భుతంగా కనిపించాయన్న సునీత
  • త్వరలోనే ఇండియాకు వెళ్లాలనుకుంటున్నానని వెల్లడి
  • తనలో భారత్ మూలాలు ఉండటం గర్వంగా ఉందని వ్యాఖ్య
Advertisement
దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఇటీవలే భూమి మీద సురక్షితంగా అడుగుపెట్టారు. తాజాగా నాసా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో అంతరిక్షంలో అనుభవాలను వీరు పంచుకున్నారు. అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపించిందనే ప్రశ్నకు సమాధానంగా చాలా అద్భుతంగా కనిపించిందని సునీత చెప్పారు. 

తాము హిమాలయాల మీద నుంచి వెళ్లిన ప్రతిసారి... మంచు పర్వతాల అందాలను విల్మోర్ కెమెరాలో బంధించారని సునీత తెలిపారు. హిమాలయాలు అత్యద్భుతం అని చెప్పారు. గుజరాత్, ముంబై వంటి ప్రాంతాల మీద నుంచి వెళుతున్నప్పుడు తీరం వెంబడి ఉండే మత్స్యకారుల పడవలు తమకు సిగ్నల్ మాదిరి పని చేసేవని అన్నారు. 

భారత్ కు వచ్చే అంశం గురించి సునీత మాట్లాడుతూ... తన తండ్రి పుట్టిన దేశానికి త్వరలోనే వెళ్లాలనుకుంటున్నానని చెప్పారు. ఇండియాలో ఉన్న బంధువులు, ప్రజలతో ముచ్చటించాలని... వారితో తన అనుభవాలను పంచుకోవాలని ఉందని అన్నారు. భారత్ ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశమని కొనియాడారు. అంతరిక్ష రంగంలో విజయాలు సాధిస్తున్న దేశాల సరసన నిలుస్తున్న దేశమని కితాబునిచ్చారు. తనలో భారత్ మూలాలు ఉండటం తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. 
Advertisement
Sunita WilliamsNASAAstronautIndia from SpaceHimalayasSpace ExplorationIndian DiasporaButch WilmoreGujaratMumbai

More Telugu News

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31
..more