Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కూల్‌డ్రింక్స్ ఎడాపెడా తాగుతున్నారా?.. అయితే, ఇది మీకోసమే!

New Study Reveals Shocking Truth About Cool Drinks
Advertisement
  • శీతలపానీయాల్లో అధిక మోతాదులో సుక్రోజ్
  • కాలేయంపై సుక్రోజ్ ప్రభావం కారణంగా పలు రుగ్మతలు
  • డయాబెటిస్, ఊబకాయం వచ్చే అవకాశం
Advertisement
ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో ఓ కూల్‌డ్రింక్ పొట్టలోకి వెళ్తే ఎంతో హాయిగా ఉంటుంది. అయితే, ఎడాపెడా శీతలపానీయాలను తాగడం తాత్కాలికంగా ఉపశమనం లభించినా ఆరోగ్యానికి మాత్రం చేటు చేస్తుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. కూల్‌డ్రింక్స్‌లో అధికంగా సుక్రోజ్ ఉంటుందని, ఇది ఆరోగ్యానికి చేటు చేస్తుందని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టిఫ్-హైదరాబాద్, ముంబై)లోని అడ్వాన్స్డ్ రీసెర్చ్ యూనిట్ ఆన్ మెటబాలిజం, డెవలప్‌మెంట్ అండ్ ఏజింగ్ (అరుమ్డా) శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధన వివరాలు ‘న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

సుక్రోజ్ కారణంగా మనం తీసుకొనే ఆహార పదార్థాల్లోని అమైనో ఆమ్లాలు, కొవ్వు కంటే ఎక్కువగా శరీరంలో అసమతుల్యంగా మారిన గ్లూకోజ్ (హెక్టోజ్ షుగర్) శోషణ జరుగుతుందని, దీనివల్ల చిన్న పేగుల మీద అత్యంత వేగంగా దుష్ప్రభావం పడుతుందని అధ్యయనంలో తేలింది. ఆహారంలోని ప్రొటీన్లను కండరాలు పెంచేందుకు దోహదపడే నిర్మాణాత్మక జీవక్రియ (అనబాలిక్), కొవ్వు, గ్లూకోజ్‌ను శక్తిగా మార్చే విచ్ఛిన్నాత్మక జీవక్రియ (క్యాటబాలిక్)పై దుష్ప్రభావాలకు కూల్‌డ్రింక్స్‌లో అధిక మోతాదులో ఉండే సుక్రోజ్ కారణమవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 

జీవక్రియకు దోహదపడే కాలేయంపై సుక్రోజ్ ప్రభావం కారణంగా పలు రుగ్మతలు వస్తాయని వెల్లడైంది. క్లోమం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసినప్పటికీ జీవక్రియపై పడే దుష్ప్రభావం కారణంగా గ్లూకోజ్‌ను శక్తిగా మార్చలేదని, ఫలితంగా డయాబెటిస్, ఊబకాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని అధ్యయనం హెచ్చరించింది. అలాగే, అధిక సుక్రోజ్ జీర్ణ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుందని పేర్కొంది. 
Advertisement
Advertisement
Tata Institute of Fundamental Research
TIFR
ARUMDA
Nutritional Biochemistry Journal
Cool Drinks
Sucrose
Diabetes
Obesity
Metabolic Disorders
Health Risks

More Telugu News