అమరావతిలో పీ-4 లోగో ఆవిష్కరించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్
- నేడు ఉగాది
- అమరావతిలో పీ-4 ఆవిష్కరణ కార్యక్రమం
- హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఇవాళ అమరావతిలో పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పీ-4 లోగోను ఆవిష్కరించారు. పీ-4 కోసం ప్రత్యేక పోర్టల్ (swarnaandhrap4@ap.gov.in)ను చంద్రబాబు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మంగళగిరికి చెందిన నరసింహ కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగా ఎంపిక చేశారు. భవన నిర్మాణ కార్మికుడు ఇమ్మానుయేల్ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా ఎంపిక చేశారు.