మయన్మార్ భూకంప తీవ్రత 334 అణుబాంబుల విస్పోటనంతో సమానమట
--
భూకంపం సంభవించిన తర్వాత కూడా దాని ప్రభావం కొంతసేపు కొనసాగుతుంది. స్వల్ప స్థాయిలో పలుమార్లు భూమి కంపిస్తుంది. దీనినే ఆఫ్టర్ షాక్స్ అంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. మయన్మార్ లో కేవలం 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాల ధాటికి 1644 మంది మరణించగా, 3 వేలకు పైగా ప్రజలు గాయపడ్డారు. భవనాలు కుప్పకూలడంతో శిథిలాల కింద వేలాది మంది చిక్కుకొని ఉంటారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.