చెన్నైపై విజయం తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ డ్యాన్స్... వీడియో షేర్ చేసిన ఆర్‌సీబీ!
ముఖ్యంగా ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. మ్యాచ్ అనంతరం ఆర్‌సీబీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లంతా సెలబ్రేషన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. Hanumankind (Run it Up) పాటకు స్టెప్పులేస్తూ అంతా సందడి చేశారు. ఈ విజయం తమకెంతో ప్రత్యేకమంటూ ఆర్‌సీబీ ప్లేయర్ల సెలబ్రేషన్స్ తాలూకు వీడియోను 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా అభిమానులతో పంచుకుంది.