పోసాని అనుచిత వ్యాఖ్యల కేసు.. సజ్జల రామకృష్ణారెడ్డికి ముందస్తు బెయిల్
- చంద్రబాబు, పవన్ కల్యాణ్, కమ్మ సామాజిక వర్గంపై పోసాని అనుచిత వ్యాఖ్యలు
- సజ్జల, భార్గవరెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్, ప్రోత్సాహంతోనే అలా మాట్లాడానని పోసాని వాంగ్మూలం
- పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ముందస్తు బెయిలు కోసం హైకోర్టుకు సజ్జల, భార్గవరెడ్డి
వీరి బెయిల్ పిటిషన్‌ను నిన్న విచారించిన హైకోర్టు ఇద్దరికీ ముందస్తు బెయిలు మంజూరు చేసింది. రూ. 10 వేల చొప్పున ఒక్కొక్కరు రెండు పూచీకత్తులు సమర్పించాలని పేర్కొంది. అలాగే, దర్యాప్తుకు సహకరించాలని జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.