నేను అదే చేసి ఉంటే... కేటీఆర్ జైల్లో ఉండేవారు: రేవంత్ రెడ్డి
- కక్షపూరిత రాజకీయాలకు తాము దూరమన్న రేవంత్ రెడ్డి
- తనను జైల్లో పెట్టి వేధించారని మండిపాటు
- కేసీఆర్, కేటీఆర్ లను జైల్లో వేయాలని చాలా మంది అడుగుతున్నారని వ్యాఖ్య
ప్రతీకార రాజకీయాలను తాను కూడా చేయాలనుకుని ఉంటే... ఈ పాటికే కొందరు జైల్లో ఉండేవారని రేవంత్ చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ లను జైల్లో వేయాలని తమను చాలా మంది అడుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ కేసులు బనాయించి, వాళ్లను జైళ్లకు పంపే నీచ రాజకీయాలను తాను చేయనని చెప్పారు.