Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నటనలో విభిన్న శైలి, పెద్దల పట్ల గౌరవం... రామ్ చరణ్ ఎదుగుదలకు దోహదం చేస్తాయి: పవన్ కల్యాణ్

Pawan Kalyans wishes for Ram Charans birthday
Advertisement
  • నేడు రామ్ చరణ్ పుట్టినరోజు
  • గ్లోబల్ స్టార్ పై విషెస్ వెల్లువ
  • ప్రకటన  విడుదల చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Advertisement
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రామ్ చరణ్ పై విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆయన బాబాయి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షిస్తున్నట్టు పవన్ తెలిపారు. 

"వెండితెరపై కథానాయకుడిగా తనదైన శైలిని ఆవిష్కరిస్తున్న రామ్ చరణ్ కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. రామ్ చరణ్ కు మరిన్ని విజయాలు, ఆనందోత్సాహాలు ఇవ్వాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. తొలి చిత్రం నుంచి ప్రతి అడుగులో ప్రేక్షకులను మెప్పిస్తూనే, ఎప్పటికప్పుడు నవ్యరీతిలో పాత్రలను ఎంచుకుంటున్నారు. 

మరోవైపు, రామ్ చరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయనలోని సామాజిక బాధ్యతను తెలియజేస్తున్నాయి. నటనలో విభిన్న శైలిని ప్రదర్శించడం, పెద్దల పట్ల గౌరవం, ఆధ్యాత్మిక చింతన, సమాజం పట్ల బాధ్యత... రామ్ చరణ్ ఎదుగుదలకు కచ్చితంగా దోహదం చేస్తాయి" అంటూ  పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
Advertisement
Advertisement
Ram Charan
Pawan Kalyan
Birthday Wishes
Tollywood
Telugu Cinema
Actor
Global Star
Social Responsibility
Acting Style
Respect for Elders

More Telugu News