రష్మిక మందన్న ఆస్తులు ఎంతో తెలుసా..?

  • ఒక్క సినిమాకు రష్మిక పారితోషికం రూ.10 కోట్లు
  • హైదరాబాద్ సహా ముంబై, బెంగళూర్ లలో సొంతిళ్లు
  • ఫోర్బ్స్ అంచనాల ప్రకారం.. రష్మిక ఆస్తుల విలువ రూ.70 కోట్లు
నేషనల్ క్రష్ రష్మిక మందన్న టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగిపోతోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే ఈ ఘనత సాధించిన రష్మిక.. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. ఇటీవల సంచలన విజయం సాధించిన ‘ఛావా’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. రష్మిక ఒక్కో సినిమాకు పారితోషికంగా రూ.10 కోట్లు తీసుకుంటుందని ప్రచారం జరుగుతోంది.

తాజాగా రష్మిక ఆస్తులకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఫోర్బ్స్ సంస్థ అంచనాల ప్రకారం... రష్మిక ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.70 కోట్లు అని, అతి త్వరలోనే రూ.100 కోట్లకు చేరుతుందని తెలిపింది. ఈ బ్యూటీకి బెంగళూరు, కూర్గ్, హైదరాబాద్, గోవా, ముంబైలలో సొంత ఇళ్లు ఉన్నాయని పేర్కొంది.


More Telugu News