Prakash Raj: 'స్పిరిట్' నుంచి తొలగించారన్న వార్తలపై ప్రకాశ్‌ రాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌

Prakash Raj Reacts to Spirit Movie Exit Rumors
ప్రభాస్ 'స్పిరిట్' నుంచి ప్రకాశ్‌ రాజ్‌ను తప్పించారంటూ ప్రచారం
సోషల్ మీడియా వార్తలను ఖండించిన సీనియర్ నటుడు
తన షూటింగ్ ఇంకా మొదలే కాలేదని స్పష్టీకరణ
ఇవి విషపూరిత ఫేక్ న్యూస్ అంటూ 'ఎక్స్‌'లో పోస్ట్
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమా నుంచి సీనియర్ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ను తొలగించారంటూ వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇదంతా విషపూరితమైన ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు.

ఈ విషయంపై ప్రకాశ్‌ రాజ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. "స్పిరిట్ సినిమాపై విషపూరితమైన ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న పెడ్లర్స్‌ అందరికీ చెబుతున్నా.. ఈ సినిమాలో నా సన్నివేశాల షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. కానీ, మీరు వాట్సాప్ ఫ్యాక్టరీలో ఊహాజనిత కథనాలు అల్లేస్తున్నారు. ఇప్పటికైనా నిద్ర లేచి ఎవరి జీవితాన్ని వాళ్లు గడపండి" అని ఘాటుగా స్పందించారు. దీనికి నవ్వుతున్న ఎమోజీలను, '#JustAsking' అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. దీంతో ఈ వదంతులకు పూర్తిస్థాయిలో చెక్ పడినట్లయింది.

ఇక‌, ఇటీవలే 'స్పిరిట్' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, కాంచన, ప్రకాశ్‌ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Prakash Raj
Spirit Movie
Prabhas
Sandeep Reddy Vanga
Fake News
Tripti Dimri
Vivek Oberoi
Telugu Cinema

More Telugu News