‘కన్నప్ప’ నుంచి కుమారదేవ శాస్త్రిగా శివ బాలాజీ పోస్టర్ విడుదల
- మంచు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప
- ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్
- ప్రతి సోమవారం ఒక అప్ డేట్
- ఈ సోమవారం శివబాలాజీ పోస్టర్ రిలీజ్
ప్రతీ సోమవారం నాడు కన్నప్ప సినిమా నుంచి ఓ అప్డేట్ వస్తుండటం ఆనవాయతీగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సోమవారం నాడు శివ బాలాజీ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కన్నప్ప చిత్రంలో శివ బాలాజీ 'కుమారదేవ శాస్త్రి' పాత్రను పోషించారు. ఈ కారెక్టర్‌ను రివీల్ చేస్తూ వదిలిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. శివ బాలాజీ ఓ ముని వేషంలో కనిపిస్తున్నారు. ఎంతో నేచురల్‌గా శివ బాలాజీ ఈ లుక్‌లో కనిపిస్తున్నారు.
ఇప్పటికే శివయ్యగా అక్షయ్ కుమార్, పార్వతీ మాతగా కాజల్ అగర్వాల్‌ను, రుద్రుడిగా ప్రభాస్‌ను, మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు పాత్రలకు సంబంధించిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు కన్నప్ప టీం సంసిద్దం అవుతోంది. ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ,మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతోన్నారు.