టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్... రోహిత్ శర్మ డకౌట్
- ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్
- రెండో మ్యాచ్ లో సీఎస్కే × ముంబయి ఇండియన్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్న
ఆ తర్వాత ఖలీల్ అహ్మద్ మరోసారి విజృంభించి ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (13)ను కూడా అవుట్ చేయడంతో ముంబయి రెండో వికెట్ చేజార్చుకుంది. వన్ డౌన్ లో వచ్చి విల్ జాక్స్ (11) సైతం క్రీజులో నిలదొక్కుకోకముందే పెవిలియన్ చేరాడు. ఈ వికెట్ రవిచంద్రన్ అశ్విన్ ఖాతాలో పడింది.
ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ స్కోరు 7 ఓవర్లలో 3 వికెట్లకు 59 పరుగులు. తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 20, తిలక్ వర్మ 14 పరుగులతో ఆడుతున్నారు.