కేజీబీవీలలో ప్రవేశాలకు ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ
--
ఏపీలో 352 కేజీబీవీలు ఉండగా.. వాటిలో ప్రస్తుతం ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది. దీనికి సంబంధించి తాజాగా దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. కేజీబీవీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 11 చివరి తేదీ అని ఎస్పీడీ తెలిపారు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, నిరుపేద (బీపీఎల్ పరిధిలోని) బాలికలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.