ఏపీకి చల్లని కబురు.. మూడు రోజులపాటు వర్షాలు
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీలు దాటడంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడతున్నారు. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో ఆ మేరకు విద్యుత్తు వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో వరుసగా మూడు రోజుపాటు వర్షాలు కురిస్తే వాతావరణం చల్లబడి ప్రజలు ఉపశమనం పొందే అవకాశం ఉంది.