విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

Powerful teaser released from Vijay Antony Bhadrakaali
  • అరుణ్ ప్రభు దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా భద్రకాళి
  • సొంత బ్యానర్ పై భద్రకాళి చిత్రాన్ని నిర్మిస్తున్న విజయ్ ఆంటోనీ 
  • ఈ వేసవిలో విడుదల 
  • టీజర్ తో పెరిగిన అంచనాలు
హీరోగా, నిర్మాతగా, లిరిసిస్ట్ గా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, ఎడిటర్‌గా ఇలా అన్ని రకాలుగా సత్తా చాటుకున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన ప్రస్తుతం తన కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకమైన 25వ చిత్రం ‘భద్రకాళి’తో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. 

ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోని సమర్పణలో అరుణ్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

తాజాగా భద్రకాళి సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. "పిల్లి కూడా ఒక రోజు పులి అవును... అబద్ధం, అహంకారం అంతం అవును"... అంటూ ప్రారంభమైన ఈ టీజర్‌ ను చూస్తే... ఈ సినిమాలో విజయ్ ఆంటోని అసలు ఏ పాత్రను పోషిస్తున్నాడన్నది సస్పెన్స్ కలిగిస్తుంది. ఒకసారి ఫ్యామిలీ మేన్‌లా, మరోసారి గ్యాంగ్ స్టర్‌లా అనిపిస్తున్నారు.. ఇంకో సందర్భంలో ఉన్నతాధికారిలా కనిపిస్తున్నారు... అసలు ఈ కిట్టు ఎవరు? అనే ఆసక్తిని రేకెత్తించేలా భద్రకాళి టీజర్‌ను కట్ చేశారు. 

190 కోట్ల కుంభకోణం పాయింట్ చుట్టూ కథ తిరుగుతుందని అర్థమవుతోంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ చివర్లో వచ్చిన డైలాగ్‌తో టీజర్ మీద మరింత ఆసక్తిని పెంచేసినట్టు అయింది. విజయ్ ఆంటోని ఈ చిత్రంలో ఇది వరకు ఎన్నడూ కనిపించినంత స్టైలిష్‌గా, యాక్షన్ హీరోగా కనిపిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ ఆంటోని సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. 

సినిమాటోగ్రాఫర్ షెల్లీ కాలిస్ట్ విజువల్స్ ఈ టీజర్‌లో అద్భుతంగా అనిపిస్తున్నాయి. విజయ్ ఆంటోనీ ఆర్ఆర్, రేమండ్ డెరిక్ క్రాస్టా ఎడిటింగ్, రాజశేఖర్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ టీజర్‌లో హైలెట్ అవుతున్నాయి. 

ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ భద్రకాళి సినిమాను సమ్మర్ కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు.
Advertisement
Bhadrakaali
Vijay Antony
Arun Prabhu

More Telugu News