మహిళలను నిందించడం ఫ్యాషనైపోయింది.. చాహల్‌తో విడాకుల వేళ ధనశ్రీ వర్మ మరో పోస్ట్

  • చాంపియన్స్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్‌లో స్నేహితురాలితో కనిపించిన చాహల్
  • ఆ వెంటనే ధనశ్రీ వర్మ పోస్ట్
  • ట్రోల్స్‌కు సమాధానంగానే ఈ పోస్టు షేర్ చేసిందంటున్న నెటిజన్లు
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. కొంతకాలంగా వినిపిస్తున్న వీరి విడాకుల వార్తలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో వీరిద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్టు వార్తలొచ్చాయి. కానీ, అవి నిజం కాదని, విడాకుల వ్యవహారం ఇంకా కోర్టు పరిధిలోనే ఉందని ధనశ్రీ వర్మ లాయర్ వివరణ ఇవ్వడంతో ఆ వార్తలకు బ్రేక్ పడింది.

తాజాగా ధనశ్రీ వర్మ షేర్ చేసిన ఇన్‌స్టా స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో ఆమె ‘మహిళలను నిందించడం ఎప్పుడూ ఫ్యాషనే’ అని రాసుకొచ్చింది. ఈ పోస్టుకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. దుబాయ్‌ వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ను తన స్నేహితురాలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, రేడియో జాకీ అయిన మవ్‌వశ్‌తో కలిసి చాహల్ వీక్షించాడు. ఈ వార్త కూడా బాగా వైరల్ అయింది. ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఈ నేపథ్యంలో దీనిని ఉద్దేశించే ధనశ్రీ వర్మ ఈ పోస్టు పెట్టిందని కొందరు అంటుండగా, విడాకుల వార్తల విషయంలో తనపై వస్తున్న ట్రోల్స్‌కు ఆమె ఇలా స్పందించారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.


More Telugu News