టీచర్ల బదిలీలకు చట్టం తీసుకొస్తాం: మంత్రి నారా లోకేశ్
- అసెంబ్లీలో వెల్లడించిన విద్యాశాఖ మంత్రి
- సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని వివరణ
- విద్యావ్యవస్థలో టీచర్లది ప్రధాన పాత్ర అని ప్రశంసలు
ఈమేరకు బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి నారా లోకేశ్ శుక్రవారం అసెంబ్లీలో ప్రసంగించారు. డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తే చాలు కేసులు పడేవని, దీంతో ఆ నోటిఫికేషన్ ఎటూ తేలేది కాదని అన్నారు. ఈ క్రమంలో లోటుపాట్లను సరిచేసి, ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేకుండా త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి వివరించారు. జీవో నెం.117ను రద్దు చేసి ప్రత్యామ్నాయ జీవో తీసుకొస్తామని మంత్రి నారా లోకేశ్ చెప్పారు.