నువ్వు కోడికత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని మేం అనలేమా?: జగన్ వ్యాఖ్యలకు మంత్రి నాదెండ్ల కౌంటర్
- పవన్ కార్పొరేటర్ కు ఎక్కువ... ఎమ్మెల్యేకు తక్కువ అన్న జగన్
- జగన్ ను తాము కూడా అనగలమని వార్నింగ్ ఇచ్చిన నాదెండ్ల
- నోరుంది కదా అని ఇష్టంవచ్చినట్టు మాట్లాడడం పద్ధతి కాదని హితవు
"నువ్వు కోడికత్తికి ఎక్కువ... గొడ్డలికి తక్కువ అని మేం అనలేమా? ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికీ తెలుసు కదా! నోరుంది కదా అని వ్యాఖ్యలు చేయడం పద్ధతి కాదు" అంటూ నాదెండ్ల ధ్వజమెత్తారు.
ఇక జగన్ ను వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యే అంటూ నాదెండ్ల ఎద్దేవా చేశారు.
"సాధారణంగా ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలు అయిపోయాక తమ సొంత నియోజకవర్గాలకు వెళ్లి ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈయన మాత్రం శాసనసభకు రాడు... తరచుగా బెంగళూరుకు వెళుతుంటాడు. మీరు ఏ విధంగా ప్రజా సమస్యలపై నిలబడతారో చెప్పండి. ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు... ఆ నిర్ణయాన్ని మీరు గౌరవించాలి కదా" అంటూ నాదెండ్ల వ్యాఖ్యానించారు.