జీఎస్టీ వసూళ్లు తగ్గడంపై కేటీఆర్ విమర్శలు
- కరోనా కంటే కాంగ్రెస్ ప్రమాదకారి అని కేటీఆర్ ఆగ్రహం
- గత ఏడాది పది శాతం నమోదైన జీఎస్టీ వసూళ్లు ఒక్క శాతం వృద్ధికి పడిపోయాయన్న కేటీఆర్
- చెత్త నిర్ణయాలతో ఆర్థిక రంగంలో విధ్వంసం జరిగిందన్న కేటీఆర్
చెత్త నిర్ణయాలతో తెలంగాణ ఆర్థిక రంగంలో విధ్వంసం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఘోర తప్పిదాల వల్లే ఈ సంక్షోభం అని ఆయన అన్నారు. ప్రభుత్వ పెద్దల కమీషన్లు ఆకాశాన్ని అంటుతుంటే రాష్ట్ర రాబడులు మాత్రం కుప్పకూలడం క్షమించరాని నేరమని అన్నారు. కేసీఆర్ పదేళ్ల స్వర్ణయుగాన్ని చెరిపేసి ముఖ్యమంత్రి రాసుకునే చీకటి చరిత్ర ఇదేనా? అని ధ్వజమెత్తారు.