ఆశా వర్కర్లపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు
- ఆశా వర్కర్ల గరిష్ఠ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంపు
- ఆశా కార్యకర్తలందరికీ ప్రయోజనం చేకూర్చేలా గ్రాట్యుటీ చెల్లింపు
- ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయిం
- ఇకపై మొదటి 2 ప్రసవాలకు 180 రోజులు వేతనంతో కూడిన సెలవులు
అంతేగాక మొదటి 2 ప్రసవాలకు ఇకపై 180 రోజులు వేతనంతో కూడిన సెలవులు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి.
కాగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 42,752 మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు. వీరిలో గ్రామాల్లో 37,017 మంది ఉంటే... పట్టణాల్లో 5,735 మంది ఉన్నారు. ప్రస్తుతం వారికి నెల జీతం కింద రూ. 10 వేలు అందుతోంది. ఇక సర్వీసు ముగింపులో గ్రాట్యుటీ కింద రూ. 1.5 లక్షలు అందే అవకాశం ఉంది.