కేఆర్ఎంబీ సమావేశానికి ఏపీ గైర్హాజరు... స్పందించిన తెలంగాణ అధికారి రాహుల్ బొజ్జా

  • రేపు మరోమారు సమావేశం కావాలని నిర్ణయం
  • ఏపీ అధికారులు ఉద్దేశపూర్వకంగా హాజరు కాలేదన్న రాహుల్ బొజ్జా
  • తన వాదనలు రికార్డు చేసి కేంద్రానికి పంపించాలన్న రాహుల్ బొజ్జా
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ అతుల్ జైన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జలసౌధలో కేఆర్ఎంబీ సమావేశం జరిగింది. ఈ భేటీలో తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్) అనిల్ కుమార్ పాల్గొన్నారు. నేటి సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి అధికారులు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో రేపు మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి అధికారులు ఎవరూ హాజరు కాకపోవడంపై రాహుల్ బొజ్జా స్పందించారు. సమావేశం ఏర్పాటు చేస్తే ఏపీ అధికారులు ఉద్దేశపూర్వకంగానే హాజరు కాలేదని ఆరోపించారు. తన వాదనలను రికార్డు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కోరారు.

కాగా, శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి మే వరకు తమకు 55 టీఎంసీల నీరు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరగా, తమకు 63 టీఎంసీల నీరు కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.


More Telugu News